ఉద్యానవన లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం

ఖమ్మం, జూలై 12 : జిల్లాలో అమలు చేయనున్న ఉద్యానవన పథకాల్లో 2012-13 సంవత్సరంలో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభమైందని ఉద్యానవన సహాయ సంచాలకుడు సుబ్బారాయుడు తెలిపారు. సంబంధిత మండల అభివృద్ధి అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బంది ద్వారా సంయుక్తంగా ఆగస్టు 24 వరకు నిర్వహించనున్నారు. ఆసక్తిగల రైతులు కొత్తగా పండ్ల తోటలు వేయడానికి, మామిడి, జీడి మామిడి, ముదురు తోటల పునరుద్దరణ, యాంత్రీకరణ, ఆయిల్‌ఫాం విస్తరణ, బోరుబావుల ఏర్పాటు, అంతర్‌పంటల సాగు, కూరగాయల విత్తనాల సరఫరా, కూరగాయల శాశ్వత పందిళ్ల ఏర్పాటు వంటివి ఉద్యానవన పథకంలో లబ్ధిపొందడానికి దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టుసైజు పోటో, ధృవీకరించిన టైటిల్‌డీడ్‌ నకలు, గుర్తింపు కార్డు నకలు, బ్యాంకు ఖాతా నకలు సమాచారంతో దరఖాస్తు చేసుకోవాలని సుబ్బారాయుడు అన్నారు.