ఉద్యోగం పేరుతో మహిళకు వల
హైదరాబాద్,ఫిబ్రవరి5(జనంసాక్షి): ఉద్యోగం పేరుతో కొందరు ఓ మహిళను నిండా ముంచారు. ఆశ చూపి మెల్లగా ఆమెనుంచి దాదాపు 13 లక్షలకు పైగా కాజేశారు. ఇప్పుడీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. ఓ మహిళకు సైబర్ చీటర్లు రూ.13లక్షలకు పైగా టోకరా వేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు సీసీఎస్ సైబర్‌కైమ్ర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ రమేశ్ బృందం దర్యాప్తు చేస్తున్నది. సుల్తాన్‌బజార్‌కు చెందిన జహర్న పటేల్ అనే మహిళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అర్పితా దాస్ అనే మహిళ ఆమెకు ఫోన్ చేసింది. నేను షీన్స్.కామ్ నుంచి మాట్లాడుతున్నానని, రూ. 2,709 రిజిస్టేష్రన్ ఫీ చెల్లిస్తే, విూకు ఉద్యోగం వెతికిపెడుతామని, ఈ డబ్బు కూడా తిరిగి చెల్లించేస్తామంటూ నమ్మించింది. ఆ తరువాత రోజు ఫియూష్ కోలి అనే వ్యక్తి ఫోన్ చేసి… విూరు రిజిస్టేష్రన్ చేసుకున్నారు, జాబ్ అప్లికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది, దానికి గేట్ పాస్, బాండ్ రిఫండ్, ్గ/ల్గ/లింగ్ ఛా/-జ్గం/స్ ఉంటాయి. వాటిని చెల్లించాల్సి ఉంటుంది. విూరు చెల్లించే డబ్బులు అన్ని తిరిగి ఉద్యోగం రాగానే విూకే వచ్చేస్తాయంటూ నమ్మించారు. ఇలా ఒక్కొక్కరు ఫోన్ చేస్తూ విూ అప్లికేషన్ ఫలాన చోట ఉంది.. విూకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తున్నా మంటూ పలు రకాల కారణాలు చూపిస్తూ సంవత్సర కాలంగా రూ. 13.07,495 లక్షలను వసూలు చేశారు. ఉద్యోగం ఇప్పించకపోగా.. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో మోసపోతున్నానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు ఇందులో ఉన్నారన్నది కూపీ లాగుతున్నారు.