ఉద్యోగుల జీవితాలతో చెలగాటం
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుపై దక్కని హావిూ
ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని వైనం
న్యూఢల్లీి,డిసెంబర్2 (జనం సాక్షి): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) రద్దు కోరుతూ ప్రభుత్వోద్యోగులు ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళనచేస్తున్నా పట్టించుకోని మొద్దు నిద్రలో ప్రభుత్వాలు ఉన్నాయి. కనీసం తెలుగు రాష్టాల్ల్రో అయినా ఈ సమస్యకు పరిష్కారం కనుగొని ఉంటే బాగుండేది. ఇందులో టీచర్లు కూడా ఉన్నారు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న టీచర్లకు మన్నశ్శాంతి లేకుండా పాఠాలు చెప్పడం సాధ్యమా అన్నది ఆలోచన చేయాలి. 2004 జవవరి 1 నుంచి నూతన పెన్షన్ పథకం పేరుతో సిపిఎస్‌ను అమల్లోకి తెచ్చింది. అనంతరం యుపిఎ`1 సర్కారు పిఎఫ్‌ఆర్‌డిఎకి చట్టబద్ధత కల్పించారు. ప్రజాప్రతినిధులకు పెన్షన్లు, సౌకర్యాలు కల్పించుకుంటున్న దశలోఉద్యోగలు పట్ల నిర్దయగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమో ఆలోచన చేయడం లేదు. సిపిఎస్ రద్దు కోరుతూ అఖిల భారత స్థాయిలో ఇప్పటికే తీవ్రస్తాయిలో సమ్మెలు జరిగాయి. సిపిఎస్ పరిధిలో దేశ వ్యాప్తంగా 56 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్య ఉద్యమాలు జోరందుకున్నాయి. వివిధ స్థాయిల్లో ధర్నాలు, సదస్సులు, చలో అసెంబ్లీ తదితర రూపాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ భవిష్యత్తుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యోగులు రిటైరయ్యాక గౌరవ ప్రదంగా కనీస జీవనం సాగించడానికి ప్రభుత్వాలు పూచీ పడటం కనీస ధర్మం. సుప్రీం కోర్టు సైతం అదే చెప్పింది. పెన్షన్ అనేది సామాజిక భద్రతాంశం. ఖజానాకు భారం అన్న పేరుతో దాన్ని ప్రభుత్వాలు వదిలించు కోవాలను కోవడం సరికాదు. ఉద్యోగుల ఆందోళనల ఫలితంగా కేంద్రం గ్రాట్యుటి ఉత్తర్వులిచ్చింది. ఎపి సైతం గ్రాట్యుటి, కుటుంబ పెన్షన్‌కు అవకాశం కల్పించినా ఉద్యోగులు దాచుకున్న మొత్తాన్నీ తిరిగి ఇవ్వాలని మెలిక పెట్టింది. సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఐక్య ఉద్యమాలు నిర్మించినప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇరు రాజధానుల్లో వరుసగా నిరసన ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తప్ప చేసిందేవిూ లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పోరాటాలు అణచివేయడం తప్ప సమ్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ది ప్రదర్శించడం లేదు. వీంతా బలమైన ఐక్యసంఘటనలుగా ఏర్పడి పోరాడుతూనే ఉన్నారు. సిపిఎస్ అమల్లోకొచ్చి దశాబ్దంన్నర కావస్తోంది. ప్రస్తుతం ఎపిలో అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న టిడిపి, వైసిపిలు దానికి అనుకూలంగా నిలిచాయి. 2004 సెప్టెంబర్ నుంచే ఆంధప్రదేశ్‌లో వైఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం తెచ్చి మరీ సిపిఎస్‌ను అమల్లో పెట్టింది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, త్రిపుర, బెంగాల్లో మాత్రమే అప్పుడు సిపిఎస్ అమలు కాలేదు. సిపిఎస్ అనేది ఉద్యోగులకు ఏ మాత్రం భరోసా లేని గందరగోళ వ్యవహారం. ఉద్యోగుల జీతాల్లో నెలకు పదిశాతం మినహాయించుకొని అంతే మొత్తంలో ప్రభుత్వం తన వాటాను జత చేస్తుంది. వాటితో ఉద్యోగులు రిటైరయ్యాక పెన్షన్ ఇస్తారు. పెన్షన్ ఎంత వస్తుందో తెలీదు. కనీస సమాచారం ఇచ్చే కార్యాలయం రాష్ట్రంలో లేదు. పైపెచ్చు సిపిఎస్ నిధులను షేర్ మార్కెట్లో పెడతారని సమచారం. ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఏ క్షణం షేర్ మార్కెట్ పుంజుకుంటుందో ఏ క్షణం కుప్పకూలుతుందో తెలీదు. రిటైరయ్యాక ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తీసుకోవాలంటే 30 శాతం ఆదాయపన్ను కట్టాలనడం మరీ దారుణం. సిపిఎస్ పర్యవసానాలు ఇంత ఘోరంగా ఉన్నందునే ఉద్యోగుల్లో అంతకంతకూ ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. వీటిపై దృష్టి సారించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.