ఉపకార వేతనాలు మంజూరు
ఆదిలాబాద్, జూన్ 21 జిల్లాలో ఐకేపీ ద్వారా అమలు అవుతున్న జనశ్రీబీమా యోజన, అబ యహస్తం, ఆం ఆద్మీ బీమాయోజన పథకంలో సభ్యత్వం కలిగిన సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయని ఐకేపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 31,552 మంది విద్యార్థులకు 1200 రూపాయల చొప్పున విడుదల అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉపకార వేతనాలను ఆయా గ్రామ సంఘాల ద్వారా ఈ నెల 22 తేదీ నుండి పంచాయతీలలో పంపిణీ చేయా లని ఆయన సూచించారు. ఇందు కోసం ప్రతి మండలాలని ఎంపీడీవోలను ప్రత్యేక అధికారిగా ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిగా నియమించాలని కలెక్టర్ నుండి ఆదేశాలు జారీ అయ్యాయని ఆ యన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేసి ఉపకార వేతనా లను అందజేయాలని ఆయన సూచించారు. మంజూరైన జాబితాను పంచాయతీల్లోని గోడలకు అతి కించాలని ఆయన సూచించారు.