ఉపాధిహావిూలో సిబ్బంది చేతివాటం
ఖమ్మం,నవంబర్ 22: ఖమ్మం జిల్లాలో ఉపాధి హావిూ పనుల్లో మరో అక్రమం వెలుగు చూసింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని జిల్లా అధికారులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవటం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పెనుబల్లి మండల ఉప్పులచెలక, వావిళ్ళపాడు, పార్ధసారథిపురం గ్రామాల్లో జరిగిన ఉపాధి హావిూ పథకం పనుల్లో పనులు చేయకుండానే నిధులు డ్రా చేయడం, వేరే గ్రాంటు- ద్వారా నిర్మించిన రహదారులను కూడా ఉపాధి హావిూ పథకంలో చేసినట్లుగా చూపిన సిబ్బంది, అధికారులు పెద్ద మొత్తంలో బిల్లులు డ్రా చేసి స్వాహా చేసినట్టు- వెలుగులోకి వచ్చింది. ఒకే చెక్ డ్యాంను వేర్వేరు పేర్లతో చూపుతూ నిధులు డ్రా చేయడం గమనార్హం. పనులకు వెళ్ళని, ఇతర పనుల్లో ఉన్న కూలీల పేర్ల ద్వారా నిధులు డ్రా చేసిన విషయం వెలుగుచూసింది. దీనిపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.