ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు
జగిత్యాల,ఏప్రిల్20(జనంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనులను నిత్యం తనిఖీ చేస్తున్నా. గ్రామాల్లో ప్రతి రోజు వందలాదిగా కూలీలు ఉపాధి పనులు చేపడుతున్నారని వివరించారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీల రక్షణకు పని ప్రదేశంలో నీడ కోసం టా ర్పాలిన్ కవర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఓఆర్‌ఎస్ పాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. కూలీలకు కొలత ప్రకారం రూ.158 పని చేస్తే రూ.205 చెల్లిస్తున్నట్లు వివరించారు. ఉపాధి కల్పనలో వెనక్కి పోవడం లేదని, కూలీల సం ఖ్య ఇంకా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.