ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యంపై నిరసన

నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్
కేసముద్రం ఆగస్టు 5 జనం సాక్షి / సమాచార హక్కు చట్టం2005 అమలులో కేసముద్రం మండలంలోని ఉపాధిహామీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ అన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఉపాధిహామీ అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం2005 ప్రకారం సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ 30 రోజులలోపు సంబంధిత సమాచారం అందించాలని చట్టం ప్రకారం నిబంధనలు ఉండగా కేసముద్రం మండలంలోని ఈ జీ ఎస్ అధికారులు చట్టం అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్లనే సకాలంలో వివరణ ఇవ్వలేకపోతున్నారని గతంలో రాష్ట్ర సమాచార కమీషనర్ మండల అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అయినా కూడా అధికారుల పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదని ఆయన అన్నారు.అదేవిధంగా సమాచార హక్కు కార్యకర్తలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్య పై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
Attachments area