ఉపాధి హామీ చట్టం నిర్విర్యానికి కేంద్రం కుట్ర: డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 21, జనం సాక్షి.
పొరాడిసాధించుకున్న గ్రామీణ ఉపాధి హమి పధకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాడానికి కుట్ర చేస్తుందని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు.బుధవారం నాడు నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు నరేగా సంఘర్ష్ మోర్చా అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉపాధి హమి చట్టాన్ని పరిరక్షించాలనె పిలుపు లో బాగాంగా బుధవారంనాడు గజ్వేల్ ఐఒసి వద్ద నిరసన చెసి గడా అధికారి ముత్యం రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన ఉపాధి హామీ కూలీలతో కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా పి శంకర్ మాట్లాడుతూ
దేశంలో వలసలను నివారించడానికి,ఉన్న గ్రామంలో పని కల్పించడానికి 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువస్తే గత ఎనిమిది సంవర్సాలుగా బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున నిరుగార్చుతూ కూలీలకు పనికల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని,గ్రామాలలో పేదలు, కూలీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్న కూలీల పొట్టకొట్టుతుందని,
తెలంగాణా కేంద్ర ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తందని అన్నారు.
దేశ వ్యాప్తంగా కూలీలకు పది వేల కొట్ల రూపాయల వేతనాలు పెండింగ్ లో వుండగా తెలంగాణ కు 450 కోట్లు చెల్లించకుండా కేంద్రం నిర్లక్ష్యం చెస్తుందన్నారు. ఉన్నాయన్నారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూలీలైన హక్కుదారులపై వివక్షత విడనాడాలన్నారు.పెండింగ్ వేతనాలు విడుదల చేయాలన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను రోజుకు ఎనిమిది వందలకు పెంచాలన్నారు.పనిదినాలను వంద రోజులనుండి రెండు వందల రోజులకు పెంచాలన్నారు. కూలీలకు భీమా సౌకర్యం కల్పించాలన్నారు.
పని హక్కుల ను కాపాడుకొవాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి,బహుజన్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్న,డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యక్రమంలో బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు.
విఅర్ ఓ ల సమ్మెకు మద్దతు
గత 59 రోజులుగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెలో వున్న విఅర్ ఒ లకు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మద్దతు ప్రకటించారు. గజ్వేల్ ఐఒసి ముందు సమ్మె లో శంకర్ మాట్లాడుతూ విఅర్ ఒల న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Attachments area
ReplyForward
|