ఉపాధి హామీ సిబ్బంది సేవలు క్రమబద్ధీకరించాలి
ఖమ్మం, అక్టోబర్ 25 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాలని ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ మురళి డిమాండ్ చేశారు. న్యాయమైన ఉపాధి హామీ సిబ్బంది, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, ఉపాధి ఉద్యోగులు గతంలో చేపట్టిన సమ్మె సమయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలను మొత్తం నెరవేర్చాలని కోరారు. ఉపాధి ఉద్యోగులు, సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు గతంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తే మరో సారి సమ్మె చేసేందుకు సిద్ధమని వారు హెచ్చరించారు.