. ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషి చేయాలి
జిల్లా విద్యాధికారి రమేష్
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషిచేసి సత్ఫలితాలను తీసుకురావాలని జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు
మన ఊరు – మన బడి లో భాగంగా శుక్రవారం
తూప్రాన్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రావెళ్లి ని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు.
మనఊరు – మన బడి లోభాగంగా పాఠశాలలో జరిగిన ఎలక్ట్రికల్ పనులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పని తీరును, యఫ్. యల్.ఎన్. విధానం అమలు తీరును, విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. టి.యల్.ఎం, యఫ్.యల్.ఎన్ రికార్డులు, ఉపాధ్యాయుల బోధనా దినసరి (డైరీ) ని పరిశీలించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు షెగ్గారి రాజగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి,విద్యార్థుల నైపుణ్యానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, నోడల్ అధికారి మల్లేశం, పాఠశాల విద్యాకమిటి అధ్యక్షులు మన్నే రాజు ఉపాధ్యాయులు ధర్మపురి,వెంకటేశం,యాదగిరి,అరవింద,పావని ఆండాళ్, సవితారాణి తదితరులు పాల్గొన్నారు