ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్
హైదరాబాద్ జనంసాక్షి: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారించాలిని డిమాండ్ చేస్తూ పదో తరగతి పరీక్ష
పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన, ప్రదర్శనలు చేపట్టాలని సమాఖ్య అధక్షుడు నారాయణ హైదరాబాద్‌లో తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని స్పాట్ కేంద్రాలను దిగ్భందనం చేయటానికి పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న నిరంతర విజ్ఞప్తులు, ముఖ్యమంత్రితో సహా విద్యాశాఖ మంత్రి, అధికారులు ఇచ్చిన హామీ అమల్లోకి రాకపోవడం వల్ల ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సి వచ్చిందిని నారాయణ స్పష్టం చేశారు.