ఉపాధ్యాయ దినోత్సవం
సందర్భంగా వ్యాస రచన పోటీలు
* స్పోకెన్ ఇంగ్లీష్ టైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్
మిర్యాలగూడ. జనం సాక్షి
ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్-5) సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ” ఆదర్శనీయమైన వృత్తి టీచింగ్…ప్రయివేట్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు-పరిష్కార మార్గాలు…టీచింగ్ వృత్తి నుంచి నేడు యువత ఎందుకు దూరం అవుతున్నారు ? విద్యాసంస్థల్లో టీచర్స్ కొరత తీర్చాలంటే మీరు సూచించే మార్గాలు (టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఐడియల్…ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై ప్రయివేట్ టీచర్స్-ఇట్స్ సొల్యూషన్స్…వై యూత్ గోయింగ్ అవే ఫ్రమ్ టీచింగ్ ప్రొఫెషన్ టుడే…వాట్ ఆర్ ద వేస్ దట్ యూ సజెస్ట్ టూ సాల్వ్ ద షార్టేజ్ ఆఫ్ టీచర్స్) అంశంపై ఆరు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో మంచి వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్తినీవిద్యార్థులు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్/ సంబంధిత తరగతి ఉపాధ్యాయుడు/ తల్లిదండ్రులచే ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సనా మొబైల్స్, షాపు నెంబర్.52 లో నేరుగా ఈనెల3వ తేదీ (శనివారం) సాయంత్రం 8 గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలు అందించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయనున్నట్టు హమీద్ షేక్ పేర్కొన్నారు.