ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు శుభాకాంక్షలు..

బహుమతులు ప్రధానొత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త.

కె ఎన్ ఆర్ సైకిల్ ఈవెంట్స్ ఫౌండర్ K.Nagraju గారి ఆధ్వర్యంలో.. ఉపాధ్యాయుల దినోత్సవం ( టీచర్స్ డే ) 05/09/2023 సందర్భంగా.. ఈరోజు ఉదయం 6 Length సెంట్రల్ వాటర్ బోర్డ్ వద్ద Telangana Historical Run & cycling Ride మరియు St Ornolds school ( RK Nagar ) పాఠశాల విద్యార్థులకు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యలో తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకి ప్రధమ మరియు ద్వితీయ బహుమతులను, ప్రశంస పత్రములను మెడల్స్ ను టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త  చేతుల మీదుగా అందించడం జరిగింది.

తదనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. సమాజాభివృద్ధికి విద్యయే మూలం’ అనే మహనీయుల స్పూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.విద్యార్థి ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు.దిశా,దశలను నిర్దేశించేది ఉపాధ్యాయులు దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్న ఉపాద్యాయుల దినోత్సవం రేపటి తరానికి చక్కటి మార్గదర్శనం కావాలని ఆయన ఆకాంక్షించారు.విద్యద్వారానే మానవ వనరులు అభివృద్ధి జరుగుతాయని అది గుర్తించిన మీదటనే  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు విస్తరించారని ఆయన తెలిపారు. దేశానికే తెలంగాణా విద్య తలమానికంగా నిలబడాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. అటువంటి సంకల్పం నెరవేర్చే గురుతర బాధ్యత ఉపాద్యాయుల మీద ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో.. అర్చన దామోదర్ కౌన్సిలర్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ SK .హుస్సేన్ ,ఉపాధ్యాయులు,వందేమాతరం ఫౌండేషన్ , ఉప్పల ఫౌండేషన్ , సుజనా హోమ్స్ ,విజయ డెంటల్ , యశోద హాస్పిటల్ నిర్వాహకులు మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు