ఉపాధ్యాయ పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ శశాంక

గంగారం అక్టోబర్ 20 (జనం సాక్షి)
ప్రాథమిక స్థాయి పాఠశాల విదార్ధులలో
అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించి, చదవడం, రాయడం లో మెళుకువలను నేర్పించారు. మౌలిక భాష, గణిత సామర్థ్యాలను(ఎఫ్ఎల్ఎన్)
ప్రాథమిక స్థాయి విద్యార్థులలో పెంపొందించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
” తొలిమెట్టు” యాప్ రిజిస్ట్రేషన్ అమలును గురువారం గంగారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కోమట్లగుడెం ప్రాథమిక పాఠశాల లో జిల్లా కలెక్టర్ కె.శశాంక పరిశీలించారు. గంగారం ప్రాథమిక పాఠశాల 5వ తరగతి విద్యార్థిని సుష్మిత వద్ద కూర్చొని సమ్మక్క – సారలమ్మ పాఠ్యాంశాన్ని చదివించి ప్రశ్నలను అడిగి జవాబులు సరిగ్గా చెప్పడం పట్ల సుష్మిత ను కలెక్టర్ అభినందించారు. అదేవిధంగా కొమట్లగూడెం ప్రాథమిక పాఠశాల లో 5వ తరగతి విద్యార్థి లాస్విత్, 3వ తరగతి విద్యార్థిని కావేరి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించి గణితం, ఇంగ్లీష్, పాఠ్యాంశాలలో ప్రశ్నలు అడిగి అభ్యసన మెళుకువలను కలెక్టర్ నేర్పించారు. యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అసిస్మెంట్ ప్రకారం పూర్తి చేయాలని, విద్యార్థులకు నష్టం జరగకూడదని, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించి ఉన్నత చదువుల లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయాలనీ కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ హై, మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, తహసీల్దార్ సూరినారాయన, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీదేవి, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు