ఉపాధ్యాయ బదిలీల జాతర

6

– షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి కడియం

హైదరాబాద్‌,జూన్‌16(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. ఈమేరకు మంగళవారంజరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బదిలీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో మాత్రం బదిలీలు ఉండకపోవచ్చని  సమాచారం.ఈ షెడ్యూల్‌ను ఆన్‌లైన్‌లో పెడతున్నామని కడియం తెలిపారు. కనీసం రెండేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు బదిలీకి అర్హులని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల సర్వీసు దాటితే ప్రధానోపాధ్యాయులను బదిలీ చేస్తామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు ఇతర చోట్ల నుంచి బదిలీలు, డిప్యుటేషన్లను అంగీకరించమని వెల్లడించారు. దీంతో  తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 16నుంచి జులై 16 వరకు ఉపాధ్యాయ బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు ఇతర చోట్ల నుంచి బదిలీలు, డిప్యుటేషన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్‌ను ఆన్‌లైన్‌లో పెడతామన్నారు. ఎనిమిది సంవత్సరాలు ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఐదేళ్ల సర్వీసు దాటిన ప్రధానోపాధ్యాయులను తప్పకుండా బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భగంగా ఈ నెల 22 నుంచి 27 వరకు బదిలీల దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం జులై 16 లోగా టీచర్ల బదిలీల పక్రియను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఒకే చోట ఎనిమిదేళ్లు పని చేసిన వారికి బదిలీ తప్పదని కడియం తెలిపారు. అలాగే ఒకే చోట ఎనిదేళ్లు పని చేసిన హెడ్మాస్టర్లను కూడా బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

హెడ్మాస్టర్లకు ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2 ఏళ్లు దాటిన వారు బదిలీకి అర్హులని చెప్పారు. అలాగే 8 ఏళ్లు దాటిన వారికి బదిలీ తప్పనిసరి అని కడియం వెల్లడించారు.