ఉప్పలపాడు పరిధిలోని గొల్లగూడెం లో హెల్త్ క్యాంపు నిర్వహణ

బయ్యారం,ఆగష్టు04(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు
బుధవారం ఎం పి హెచ్ సి బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో హెల్త్ క్యాంపు, ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సమస్యలు టీబీ వ్యాధి ఏవిధంగా వస్తుందని,నివారణ చర్యలు పాటించవలసిన జాగ్రత్తలు,వ్యాధి తీవ్రతను,వ్యాధి పట్ల జాగ్రత్తలు, టీబీ వ్యాధిగ్రస్తులు తుమ్మినా,దగ్గినా,తుంపర్ల రూపంలో ఇతరులకు సోకే ప్రమాదం ఉందని,ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని,త్రాగే నీరును చల్లార్చి తాగాలని సూచిస్తూ జ్వరం, జలుబు, చిరు వ్యాధులకు చికిత్స చేసి మందులను అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్. అమ్రు, సిహెచ్ఓ. చందు,భారతి,టిబి నోడల్ సూపర్వైజర్ రామారావు, బ్లాక్ కోఆర్డినేటర్ డి. రాము, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు