ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం
జగిత్యాలలోనూ పాగావేస్తున్నాం: ఎంపి వినోద్
కరీంనగర్,నవబంర్28(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనరగ్ జిల్లాలో జగిత్యాల సహా అన్ని సీట్లను టిఆర్‌ఎస్ గెల్చుకోబోతున్నదని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపెల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని పర్యటనతో ఒరిగిందేవిూ లేదన్నారు. కనీసం తెలంగాణ సమస్యలపై స్పష్టత కూడా ఇవ్వలేదన్నారు. ఆయన మాటలను ప్రజలు నమ్మబోరని అన్నారు. తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడనుందని అన్నారు. నీళ్లు నిధులు, నియామకాలు కార్యక్రామల్లో భాగంగా కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల, నంది మేడారం, లక్ష్మీపూర్, రాంపూర్, రాజేశ్వర్ రావుపేట, ముప్కాల్ లో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని అన్నారు. పలు పథకాలను రూపొందించి సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నా మన్నారు. పెన్షన్‌ను రూ.200కు పైగా ఇవ్వలేమని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రూ.2వేలు ఇస్తామంటు న్నారనీ, విూరు అడగక పోయినా ఉద్యమ పార్టీ నాయకుడు రూ.200 నుంచి పెన్షన్‌ను రూ.1000కు పెంచి ఇంతవరకు అందజేశామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడితే ప్రస్తుతం ఉన్న పెన్షన్ మొత్తాలను రెట్టింపు చేస్తామని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపె ట్టిందన్నారు. రాబోయే కాలంలో భూములు లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు గానూ మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.