ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

గెలుపు ధీమాలో టిఆర్‌ఎస్‌ శ్రేణులు

ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్‌ అశలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలుల, రాజకీయ వ్యూహాలతో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు ఎంపీ, పది ఎమ్మెల్యే స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి,జోగు రామన్నలు ధీమాగా ఉన్నారు. అయితే ఈ సారి టిఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదన్నరీతిలో కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోంది. మరో పది నెల్లోల ఎన్నికలు జరునున్న నేపథ్యంలో జిల్లాలో ఎవరికి వారు దూసుకుని పోతూ పరస్పర విమర్వలతో సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు కంకణం కట్టుకుని కార్మికుల ఆశలు నెరవేర్చామని టిఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6.50 కోట్ల రాయితీని కంపెనీకి చెల్లించడానికిఅంగీకారం తెలిపిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే మిల్లు పున:ప్రారంభానికి మార్గం సుగమమైందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎమ్మెల్యేల చేతుల్లో డీఎంఎఫ్‌టీ నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వివరించారు. ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల కారణంగా జిల్లా సస్యశ్యామలం కాబోతున్నదని అన్నారు. రైతుబంధు, బీమా, ఇతర అనేకానేక సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ విజయనాకి పునాది అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీని విమర్శిస్తున్నా అంతర్గత విభేదాలు వీడడం లేదు. వర్గాలుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారు టిక్కెట్లపై దృష్టితో పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులు సహజమే అయినప్పటికీ… ఎన్నికల సంవత్సరంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ భట్టి విక్రమార్కలకు మద్దతుదారులుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వర్గానికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కీలక నాయకులుగా ఉన్నారు. పార్టీలో మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు రాష్ట్రస్థాయిలో ఉన్న రెండు ప్రధాన వర్గాలకు ముఖ్య నాయకులుగా మారడంతో రాజకీయం వీరి చుట్టూనే తిరుగుతోంది. భట్టి విక్రమార్క వర్గానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నాయకత్వం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, సిర్పూర్‌ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్‌ కూడా ప్రేంసాగర్‌ వర్గంగానే కొనసాగుతున్నారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో గత మేలో ఉత్తమ్‌ బృందం ఐదు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సు యాత్ర తమ నియోజకవర్గాల్లోకి వచ్చినప్పుడే ప్రేంసాగర్‌రావు గ్రూపు నాయకులు హడావుడి చేశారే తప్ప పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. గత కొంతకాలంగా భట్టి విక్రమార్క గ్రూపులో శ్రీధర్‌బాబుతో కలిసి కార్యక్రమాలు చేస్తున్న ప్రేంసాగర్‌రావుకు రేవంత్‌ వర్గం నుంచి వచ్చిన ముగ్గురు నేతల మద్దతు లభించడంతో మరింత బలం చేకూరింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా పర్యటిస్తూ, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈసారి మంచిర్యాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. చెన్నూర్‌లో మాజీ మంత్రి బోడ జనార్దన్‌ ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు వర్గంలో చేరిపోయారు. అరవింద్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టికెట్టు వేటలో ఉన్నారు. బెల్లంపల్లిలో కూడా ఇదే వర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరోసారి పోటీకి సిద్ధపడుతుండగా, ప్రేంసాగర్‌రావు గ్రూపు నుంచి మున్సిపల్‌ కౌన్సిలర్‌ రొడ్డ శారద ప్రధాన పోటీదారుగా మారారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని సైతం టిక్కెట్టు రేసులో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌ నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీలో మహేశ్వర్‌రెడ్డితో పోటీపడే నాయకులు సవిూపంలో మరొకరు లేడు. నిర్మల్‌తో పాటు ముథోల్‌, ఖానాపూర్‌లలో కూడా ఆయన వర్గీయులే పార్టీ టిక్కెట్ల రేసులో ముందున్నారు. ముథోల్‌, ఖానాపూర్‌లలో టిక్కెట్ల కోసం పోటీ ఉన్నా, మహేశ్వర్‌రెడ్డి ఎవరి పేరు చెపితే వారికే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీ ఉద్యమం తరువాత బంల

సమకూర్చుకున్నారు. సిర్పూర్‌లో మహేశ్వర్‌రెడ్డి వర్గంలో బీసీ ఉద్యమ నాయకుడు గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి ఉన్నారు. సిడాం గణపతి ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి వర్గీయుడైన రావి శ్రీనివాస్‌ ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు క్యాంపులో ఉన్నారు. ఆయన టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ బీసీ, స్థానికత అంశాలు తెరపైకి వస్తే శ్రీనివాస్‌ యాదవ్‌కే అధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. మొత్తంగా అటు టిఆర్‌ఎస్‌ కెసిఆర్‌ ఛరిష్మా తమను కాపాడుఉతందన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాత్రం టిఆర్‌ఎస్‌ వ్యతిరేకతే తమ గెలుపు కాబోతుందని ధీమగా ఉన్నారు.