ఉమ్మడి జిల్లాలో సంతృప్తికరంగా వర్షం
ఆదిలాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): తెలంగాణాలో ఇటీవల విస్తారంగా వర్షాలు పడడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అత్యధికంగా వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రవేశ కాలంలోనే అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. ఇక ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కారణంగా గోదావరి పెద్దగా పారకపోయినా తగినంతగా నీరు చేరింది. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులకు వరద ఉదృతి పెరిగింది. కడెం, జన్నారం, దండేపల్లి, లక్షెటిపేట, మంచిర్యాల మండలాల్లోని సుమారు 60వేల ఎకరాలకు సాగునీటినందించే ప్రధానకాలువకు వారబందీ పద్ధతిలో నీటివిడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో మంచి వర్షాలు కురిసాయి. అయినా ఓ వైపు ఎండ తీవ్రత తప్పడం లేదు. కొన్ని మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.