ఉమ్మడి జిల్లాలో 114 కోట్ల విద్యుత్‌ బకాయిలు

వసూళ్లకు రంగంలోకి దిగిన అధికారులు

జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఈనెల 31లోగా విద్యుత్‌ బకాయిలు ఉన్న వినియోగదారులంతా వెంటనే చెల్లించాలని ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్‌ నర్సింగారావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగారు. బకాయిలా జాబితా తీసుకుని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బిల్లులు కట్టేలా చేస్తున్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేయాలంటే ప్రతి వినియోగదారులు వారు వినియోగించుకున్న విద్యుత్‌ కు సరిపడా బిల్లులను సకాలంలో సక్రమంగా చెల్లించినప్పుడే అది సాధ్యపడుతుందని అన్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రూ.114. 13 కోట్ల విద్యుత్‌ బకాయిలున్నాయనీ, ఇందులో విధిదీపాలు, నీటిసరఫరా బిల్లులు, వ్యవసాయ, గృహ, పరిశ్రమల బిల్లులు ఉన్నాయని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు బకాయిలు పడడం వల్ల సంస్థ ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని.. ఈనెల 31 వరకు బకాయిల వసూళ్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చే పడుతున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో నో డల్‌ అధికారిని నియమించామనీ, బకాయిదారులందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చామనీ, వెంటనే స్పందించి వారి వారి

బకాయిలను ఈనెల 31లోపు చెల్లించాలి కోరారు. బకాయిలు చెల్లించని వారి సర్వీసులు కట్‌ చేస్తామని చెప్పారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు బకాయిపడిన వినియోగదారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రంగాలకు 24గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తూ యావత్తు దేశం దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయాలని చూస్తుందన్నారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదిలావుంటే వినియోగదారులకు, విద్యుత్‌ సిబ్బందికి మధ్య అవినాభావ సంబంధం ఉంటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు బాకీల వారు వచ్చినట్లుగా కాకుండా మంచి రిలేషన్ల్‌ ఉండేలా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా ఎవరూ ఊహించని విధంగా జరుగుతుంది.. 2018 జనవరి నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా జరుగుతుంది.ఈ నేపథ్యంలో పడే లోడ్‌ తట్టుకునేందుకు కావాల్సిన ట్రాన్స్‌ డిస్టిబ్యూట్రరీ లైన్లు, సబ్‌ వంటివి ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరింత మెరుగైన సరఫరా కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలను విస్తృతం చేయాలంటే అవన్నీ అర్థిక వనరులతో ముడిపడి ఉంది. ఇవన్నీ వనిఇయోగదారులకు తెలిసేలా చేస్తున్నారు. వాడుకున్న విద్యుత్‌ సరిపడా వినియోగదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తే మరింత మెరుగ్గా సర్వీసు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అయితే బకాయిలు పెరిగి పోతున్నాయనీ, ఫలితంగా విద్యు త్‌ పంపిణీ సంస్థలు మరింత ప్రగతిని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

—–

———–

—-

 

—-

 

—–

 

 

——

 

—–

 

——————

———–