ఉమ్మడి వ్యూహంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
పవిత్ర రంజాన్ రక్తపుటేరులు పారిస్తోంది. ముష్కరుల రక్తదాహానానికి అమాయకుల బలవుతున్నారు. ఇస్లాం పేరుతో సృష్టిస్తున్న నరమేధానికి ప్రపంచ దేశాలు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ముష్కరలును మట్టుపెట్టేందుకు ఉమ్మడి చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఓ దేశ సమస్యకాదు. ఇప్పుడది ప్రపంచ సమస్యగా మారింది. దీనిని సమిష్టిగా ఎదుర్కోవాలన్న ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును అన్ని దేశాలు ఆమోదించాలి. అవసరమైతే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక దళాలను, ఉమ్మడి నిఘాను ఏర్పాటు చేసుకుంటే తప్ప ఉగ్రవాద ముప్పును ఎదుర్కోలేం. దీనికి విరుగుడుగా ఆయా దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మొన్న ఇస్తాంబ్ల, నిన్న ఢాకా, ఇప్పుడు బాగ్దాద్… ప్రాంతం ఏదైనా ముష్కరులు తమ ఉనికిని చాటుకునేందుకు తోటి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఒక్కబిడ్డను బతికించడం ఎంత కష్టమో వీరికి తెలియదు. కానీ ప్రాణాలను మాత్రం దారుణంగా తీసేస్తున్నారు. ఇస్తాంబుల్, ఢాకా ఘటనల నుంచి తేరుకోకముందే ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్ల కారణంగా రక్తిసక్తం అయ్యింది. రంజాన్ పండుగ వాతావరణంతో కళకళలాడిన వీధులు ఒక్కసారిగా హాహాకారాలతో ప్రతిధ్వనించాయి. చిన్న పిల్లల ఆటలు, కేరింతలతో తుళ్లిపడిన షాపింగ్ మాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉపవాస దీక్ష ముగించుకొని కరాదా వాణిజ్య ప్రాంతంలో షాపింగ్‌కు వచ్చిన కుటుంబాలు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద దాడికి బలయ్యాయి. అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రెండు ఆత్మాహుతి పేలుళ్లలో మొత్తం 131 మంది మరణించారు. 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల్లో 15 మంది, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పిల్లలే. ఐఎస్ వరుస దాడులను నివారించడంలో విఫలమైన ఇరాక్ సర్కారుపై బాగ్దాదు ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సద్దాం హుస్సేన్ ఉరితీత తర్వాత ఇరాక్‌లో మారణ¬మం పెరిగింది. బాగ్దాద్‌పై పెఓత్తనానికి అమెరికా చేసిన తప్పుడు పనలు కారణంగా సద్దాం హుస్సేన్ బలి అయ్యాడు . కానీ ఆ దేవంలో స్థానికంగా ఉగ్రవాద స్శారాలు పెరిగాయి. ట్రక్కులో పేలుడు పదార్థం చేసుకొని వచ్చిన వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాలప్పడ కారణంగా షాపింగ్ మాల్ వద్ద పేలుడుతో దుకాణ సముదాయం మొత్తం కాలిపోయింది. సంఘటన స్థలం కాలిపోయిన భవనాలు, చెల్లాచెదరుగా పడిన మృతదేహాలతో భీతావహంగా ఉంది. సంఘటన జరిగిన 12 గంటల వరకు దుకాణాల్లో మంటలు ఎగిశాయంటే ఎంతటి విధ్వసం జరిగిందో ఊహించుకోవచ్చు. ఎదురు దెబ్బల నేపథ్యంలో ఉనికి కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా ఐఎస్ ప్రపంచవ్యాప్తంగా భయానక హింసకు పాల్పడే అవకాశముందంటూ అమెరికా నిఘావిభాగం గతనెల్లో సెనేట్ కమిటీకి నివేదిక అందించింది. వారంరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే వారి అంచనాలు నిజమైనట్లే అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతవారం పలు ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. టర్కీలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడి, ఢాకా మారణ¬మం ప్రధానంగా ప్రజలను బెంబేలెత్తించాయి.
మారణ¬మం, దాడులు, రేపులు, ప్రతీకారాలు ఇవే ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ లక్ష్యగా ఉన్నాయి. అందుకే ఉగ్రవాదులు తరతమ భేదం లేకుండా పవిత్రరాంజాన్ మాసం అనికూడా చూడకుండా రక్తదాహం తీర్చుకుంటున్నారు. సిరియా, ఇరాక్‌ల్లో భూభాగాలను క్రమంగా కోల్పోతున్న ఐఎస్‌ఐఎస్ ఒత్తిడికి గురవుతోంది. తమ ఉనికి చాటిచెప్పుకునేందుకే ప్రపంచవ్యాప్త దాడులకు దిగుతోందని టర్కీలో ఇటీవలి దాడి, బంగ్లాదేశ్, ఇరాక్‌లో తాజా మారణ¬మం గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలన్న తమ కల సాకారమయ్యే అవకాశాలు రోజురోజుకూ మృగ్యం కావడం, అమెరికా దళాలు లేదా సంకీర్ణ దలాళ దాడులు పెరగడంతో రెచ్చిపోతున్నారు. తాలిబన్ ఉగ్రవాదులు, అల్‌ఖైదా కూడా
ఇలాగే పెట్రేగి పోయి ఇప్పుడు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. ఐఎస్ కూడా ఇలాగే అంతర్ధానం కాక తప్పదు. అయితే అప్పటి వరకు ఇలాంటి మారణ¬మాలు తప్పేలా లేవు. ఐఎస్‌కు కొన్ని నెలలుగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాక్‌లో తమకు కీలక స్థావరంగా ఉన్న ఫలూజాను భద్రతా బలగాలు స్శాధీనం చేసుకున్నాయి. లిబియాలోనూ సిర్తేను చేజార్చుకుంది. ఫలూజా పట్టణాన్ని పూర్తిగా చేజిక్కించుకున్నట్లు ఇరాక్ ప్రభుత్వం వారం రోజుల క్రితమే ఘనంగా ప్రకటించుకుంది. ఈ పరిస్థితుల్లో ఐఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న ఈ సంస్థ ఆత్మవిశ్వాసం క్రమంగా బీటలు వారుతోంది.ఈ నేపథ్యంలోనే ఉనికిని చాటుకొనేందుకు ప్రపంచమంతటా, ముఖ్యంగా ఇరాక్‌లోని ప్రభుత్వ ఆధీనంలోని భూభాగాల్లో ఐఎస్ ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. అయితే, ఇరాక్‌లో రెండో అతిపెద్ద నగరమైన మోసూల్ ఇప్పటికీ ఐఎస్ చేతిలోనే ఉంది. అక్కడి బలంతో ఇరాక్‌లో ఏమూలనైనా దాడులు చేయగల సత్తా ఈ సంస్థకు ఉంది.ఆర్నెళ్లక్రితం వరకు పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లిన ఐఎస్ అనుబంధ సంస్థలు యెమెన్, అఫ్గానిస్థాన్, ఈజిప్టుల్లో క్రమంగా తమ పట్టు కోల్పోతున్నాయి. ఇది వారిలో అసహనానికి కారణం అవుతోంది. తమ పట్టు తప్పలేదని, తాము బలంగా ఉన్నామని చాటడానికి దాడులకు తెగిస్తున్నారు. అయితే దొంగదెబ్బ తీయడానికి పెద్దగా వ్యూహాలు, బలం అవసరం లేదు. అందుకు ఇటీవలి దాడులే నిదర్శనం. ఈ దాడులను అరికట్టాలంటే ఉమ్మడి వ్యూహాలతో ముందుకు సాగాలి. ఈ రాక్షసుల పీచమణచడానికి ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రపంచ దేశాలు భరించి ముందుకు రావాల్సిన అవసరాన్ని ఇటీవలి దాడులు గుర్తు చేస్తున్నాయి.