ఉరిశిక్షను రద్దు చేయండి

1

-యుద్ధనేరాలు, ఉగ్రవాదదాడులు మినహా

-లా కమిషన్‌ సిఫారసు

ఢిల్లీ , ఆగష్టు 31 (జనంసాక్షి):

ఉగ్రవాదం, యుద్ధనేరాల కేసుల్లో దోషులకు మినహా ఇతర రకాల అన్ని కేసుల్లో ఉరిశిక్షను రద్దు చేయాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఏపీ

షా ఈ మేరకు నివేదిక రూపొందించారు.ఉరిశిక్షను రద్దు చేయడంపై జస్టిస్‌ షా నివేదికపై లా కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, మరో ఆరుగురు

సభ్యులు మద్దతు తెలిపారు. ఉగ్రవాద చర్యల్లో మరణశిక్ష గురించి పార్లమెంట్‌లో చర్చజరగాలని, ఈ కేసుల్లో ఉరిశిక్ష రద్దుకు వెంటనే సిఫారసు చేయబోమని లా కమిషన్‌

పేర్కొంది.