ఉలవల వల్ల ప్రయోజనాలు
ఉలవలు అంటే మనలో చాలా మందికి తెలుసు..అయితే వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.ఇక ఉలవలను మన తెలుగు రాష్ట్రాలలో ఉలవలు అనే అంటారు.ఇక ఉలవలు అంటే ఎక్కువగా గేదెలకు ఆవులకు మేతగా వేస్తారు , వాటిని ఉడకబెట్టి ఆహారంగా అందిస్తారు.ముఖ్యంగా పశుపోషణలో అందరికి ఉలవలు తెలుసు.
ఇక ఉలవలతో ఉలవ చారు చేసుకుంటారు.ఇది రుచిగా ఎంతో బాగుంటుంది. అలాగే రుచికి తగినట్టే దాని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంది. అయితే శరీరానికి ఎంతో మేలు చేసే పోషకాలు ఉలవల్లో బాగానే ఉన్నాయి ఓసారి అవేంటో తెలుసుకుందాం.
ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది.ఉలవలను కషాయం రూపంలో చేసుకుని తీసుకుంటే మలబద్దకం పోతుంది..కఫం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఔషదంగా చెప్పవచ్చు.
ఉలవలు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. ఇక ఉలవలను ఎండబెట్టి వాటిని పొడిచేసుకుని నీటిలో తాగితే ఫ్యాట్ సమస్య కూడా తగ్గిపోతుంది అలాగే అధిక బరువు కొలెస్ట్రాల్ సమస్యలు దరిచేరవు.
ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. ఉలవలను కప్పు వేసి దానికి నాలుగు గ్లాసులు నీరు వేసి కుక్కర్ లో పెట్టి అందులో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే అద్బుతమైన ఫలితం ఉంటుంది ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఉలవలను వేడి చేసి కాటన్ గుడ్డలో చుట్టి కీళ్లు మడం నొప్పి ఉన్నచోట అద్దితే ఆ సమస్య తొలిగిపోతుంది. ఇక కొబ్బరి నీరు ఉలవచారు కలిపి సమానభాగంగా తీసుకుంటే శరీరంలో వేడి అలాగే మూత్ర సమస్యలు తొలిగిపోతాయి.అందుకే ఉలవలను ఆహారంలో అప్పుడప్పుడూ వాడుతూ ఉండండి ఉలవలు తరచూ తీసుకుంటే మీ ఆరోగ్యానికి డోకా ఉండదు.