ఉసిరి ధరలకు రెక్కలు

కొమ్మ,కాయల ధరలకు రెక్కలు
హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి): కార్తీక పౌర్ణమి కావడంతో దీపోత్సవాలకు ప్రధాన్యం పెరిగింది. అయితే ఉసిరి కాయలకు, ఉసిరి కొమ్మలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో కొమ్మ కనీసం 50రూపాయలకు అమ్మారు. ఉసిరి కాయ కనీసం 5 నుంచి పది రూపాయాలకు అమ్మారు.  మహిళలు ఉదయాన్నే ఆలయాలకు చేరుకని దీపాలు వెలిగించారు. ఇల్లు శుభ్రం చేయడం, చక్కగా ముగ్గులు పెట్టడం, తల స్నానం చేయడం, దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగించడం.. ఇవన్నీ మనం ఆచరించే పద్ధతులే.  కార్తీకమాసం
సందర్భంగా తరచి చూస్తే వీటన్నిటిలో విశిష్టతలున్నాయి. అంతరార్థం గ్రహిస్తే సిరిసంపదలకూ, అనుబంధాలకూ బాటలు పరిచే అంశాలున్నాయి. కార్తాక పౌర్ణమిరోజు ఉసిరికాయతో తలంటి స్నానం చేయడం ఆనవాయితీ.ఉసిరి కొమ్మకు పూజలు చేయడం కూడా ఆచారం. దీంతో వీటి ధరలువిపరీతంగా పెరిగాయి. దీపాన్ని వెలిగించడానికి ఒత్తులు వెలగించి అరటి బోదెల్లో నదుల్లో వదిలారు. దీపారాధనలో ఉత్తమం నేతితో దీపం పెట్టడం కుదరనప్పుడు ఏ నూనె వాడినా ఓ నేతి చుక్క వేస్తే మంచిది.వేదాంత పరంగా అంతరంగంలోని చీకటి, అహం తొలగిపోతాయి. దీపాలను వెలిగించడమంటే యశస్సు, జ్ఞానం, సంపదలను ఆహ్వానించడమే. శ్రీసూక్తంలో ’జాతవేదో మమావహ’ అనీ, యజుర్వేదంలో ’శ్రియమిచ్చేత్‌ హుతాసనాత్‌’ సంపద కావాలంటే అగ్నిని పూజించాలనీ ఉంది. సకల శుభాలనూ అందిస్తుందనే నమ్మకంతోనే  అగ్నిని పూజిస్తారు. వివిధ రకాల ప్రమిదల్లో దీపం వెలిగించవచ్చు. దీంతో ఉసిరి కాయలో కూడా నెయ్యి వేసి దీపాలు వెలిగించడం, వ్రతాలు ఆచరించడం పరిపాటిగా వస్తోంది. ఆలయాల్లో లక్షవత్తుల దీపారాధనల్లో మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్‌ శంకర్‌ మఠం, శ్రీకాళహస్తి, శ్రీశైలం తదితర ఆయలాల్లో ఒత్తుల వెలిగింపు పెద్ద  ఎత్తున చేపడతారు.
“““““`