ఉ.కోరియా క్షిపణులను అడ్డుకుంటాం: అమెరికా

వాషింగ్టన్‌(బీజింగ్‌):ఉ.కోరియా తమ దేశంపై క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాలిలోనే అడ్డుకుని నేలకూల్చి వేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఆసియో పసిఫిక్‌ మాండ్‌ ఇన్‌ఛార్జ్‌ శామ్యూల్‌ లాక్లియర్‌ బుధవారం ఇక్కడ సెనేట్‌ సభ్యుల కమిటి సమావేశంలో మాట్లాడుతూ మాతృభూమి పరిరక్షణకు, మిత్ర దేశాల పరిరక్షణకు తాము సిద్ధంగా వున్నామని, ఉ.కోరియా క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాలిలోనే కూల్చి వేయమని సైన్యాన్ని ఆదేశిస్తానని చెప్పారు. ఒక వేళ ముప్పు లేక పోయినా ఉ.కోరియా క్షిపణులను కూల్చివేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన నో అని ఒదులిచ్చారు.

ఉభయ కోరియాల మధ్య ఉద్రిక్తతల తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం తమ క్షిపణి యంత్రాంగాన్ని,క్షిపణి విధ్వంసక నౌకలను ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి తరలించింది. దీనితో పాటు గువామ్‌ ప్రాంతంలో అత్యంత ఎత్తయిన క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.