ఊరూర జలశక్తి అభియాన్ కార్యక్రమం

కూసుమంచి ఆగస్టు 31 ( జనంసాక్షి  ) :  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల శక్తి అభియాన్  కార్యక్రమం శనివారం మండలంలోని  41 గ్రామ పంచాయతీలలో గ్రామ స్వయం సేవక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మండల అభివృద్ధి అధికారి కుసు వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలో చేగొమ్మ గ్రామంలో జరిగిన జలశక్తి అభియాన్ కార్యక్రమం లో డిఆర్డిఎ పిడి ఇందుమతి పాల్గొని జల ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా హైస్కూల్ నందు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో  డి పి ఎం ఆంజనేయులు ,ఎంపీడీవో  కుసు వెంకటేశ్వర్లు ,ఎం ఈ ఓ వెంకట రామాచారి, ఏ పి ఎం హర్షవర్ధన్, ఏ పీ ఓ నాగరాజు, గ్రామ సర్పంచ్ రమణమ్మ , పాల్గొన్నారు.                           మండలంలో  నాయకన్ గూడెం లో జరిగిన జలశక్తి అభియాన్ కార్యక్రమం లో మండల ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల పద్మ  వీరారెడ్డి బస్ స్టాండ్ సెంటర్ నుండి జలశక్తి అభియాన్ కార్యక్రమం ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి యందు ఇంకుడు గుంతలు తీసుకోవాలని ప్రతి  రైతు పొలం యందు  ఫామ్  పాండ్స్  నిర్మించుకోవాలని. నీటి యొక్క విలువను తెలియజేశారు.  ఇదే కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కాసాని సైదులు మాట్లాడుతూ ఇంకా గ్రామంలో ఇంకుడు గుంతలు  నిర్మించని వారు ఇంకుడు గుంత నిర్మించుకోవాలని హరితహారం లో భాగంగా ప్రతి ఇంటి యందు ఒక చెట్టు నాటి దానిని సంరక్షించుకోవాలి అని అలాగే గ్రామ పారిశుద్ధ్యానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల వీరారెడ్డి, గ్రామ వైస్ సర్పంచ్ కిన్నెర శ్రీకాంత్,  పంచాయతీ సెక్రటరీ రామ్ రెడ్డి ఉపేంద్ర ,గ్రామ స్వయం సేవక సంఘాల అధ్యక్షురాలు మండవ నాగమణి ,సరస్వతి ,నసీమా ,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.