మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
భూపాలపల్లి జిల్లా (జనంసాక్షి) : సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనేందుకు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చెన్నపురం గ్రామంలో రోడ్ ప్రమాదం జరగ్గా వెంటనే తన వాహనాన్ని ఆపి తన సిబ్బందిని అప్రమత్తమం చేసి అంబులెన్స్ లో బాధితులను ఆస్పత్రికి పంపించారు. ఆటో, బైక్ డికొన్న ఘటనలో పలువురు గాయాల పాలు కాగ, చిన్నారులు షాక్ కు గురయ్యారు. వారిని ఓదార్చడంతో పాటు, దైర్యం చెప్పి ఆసుపత్రికి తరలించారు మంత్రి సీతక్క. దీంతో మంత్రి సీతక్క మానవ సేవయే మాధవ సేవ అన్న నానుడిని ఆచరించి చూపారనీ అక్కడి ప్రజలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.