ఎంజీఎంలో నాలుగు రోజుల పాప మృతి
వరంగల్: వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో వరంగల్లోని ఎంజీఎంలో నాలుగు రోజుల చిన్నారి ఈ రోజు ఉదయం మృతిచెందింది. దీంతో ఆగ్రహిచిన తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటిలేటర్ లేకపోవడంతో మూడు రోజుల క్రితం ఓ శిశువు మృతిచెందిన ఘటన మరువక ముందే ఈ రోజు మరో చిన్నారి చనిపోవడం ఆందోళన కలిగించే విషయం.