ఎండల తీవ్రతతో జాగ్రత్త: ఆర్టీజీఎస్‌ హెచ్చరిక 

అమరావతి,మే4(జ‌నంసాక్షి):  ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్‌ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని కాబట్టి ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్టీజీఎస్‌ తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో… 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ తెలిపింది.వేసవి వచ్చిందంటే చాలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం వీధుల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జంతువులు, పశువులు కూడా మన మధ్యనే జీవిస్తున్నాయి. వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వీధుల్లో బోరు పంపులు, నీటి కుళాయిలు కూడా ఉండటం లేదు. అలాగే భూగర్భడ్రైనేజీ వ్యవస్థ వలన కూడా నీరు ఎక్కడా కనిపించని పరిస్థితి. దీనితో జంతువులు, పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీవ కారుణ్యం సంస్థ తరపున, దాతల సహకారంతో గత ఆరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ఏడాది వంద తొట్టెలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని భవానీపురం, విద్యాధరపురం, వన్‌టౌన్‌, సత్యనారాయణపురం, లెనిన్‌సెంటర్‌, తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు వాటి వద్దకు ట్యాంకర్‌ను తీసుకుని వెళ్లటం, నీటితో నింపటం చేస్తున్నారు. పరిశుభ్రమైన నీటిని అందించేందుకు తొట్టెలను శుభ్రం చేస్తారు. జంతువులపై ఉన్న ప్రేమతో ఆయన శక్తి కొలదీ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జంతువులకు నీటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.