ఎంత మంది మృతి చెందితే స్పందిస్తారు సారు !
రామారెడ్డి జనంసాక్షీ సెప్టెంబర్ 11 :
ఎంత మంది మృతి చెందితే స్పందిస్తారు సారు ! అని రామారెడ్డి జడ్పీటీసీ దీక్షలో ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, శనివారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామనికి చెందిన వ్యక్తి రామారెడ్డి మండల కేంద్రనికి పనుల నిమిత్తం తిరుగు ప్రయాణ నిమిత్తం రామారెడ్డి శివారులో గల గంగమ్మ వంతెన శితిలావస్థలో ఉంది .కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి శితిలావస్థలో ఉన్న గంగమ్మ వంతెనను గమనించలేదు. కారు అదుపుతప్పి ప్రవహించే నీటిలో కారుతో పడి అందులోనే మృతి చెందాడు. మృతుడిని బయటకు తీశారు. ఇంతవరకు ఎంతోమంది గంగమ్మ వాగులో పడి ప్రాణాలు కోల్పోయారు. మనుషుల ప్రాణాలు పోయినప్పుడు తూతూ మంత్రంగా మండల నాయకులు, సంబంధీత అధికారులు వచ్చి కొలతలు వేయడం అంచనాలకు సరిపోయారు. గంగమ్మ వంతెనను ఇప్పటికీ దాదాపు పది మంది పడి ప్రాణాలు కోల్పోయారు. ఒక మర్డర్ జరిగింది. ఇట్టి విషయం పోలీసు నిఘ వర్గాలకు తెలుసు అయినప్పటికీ బ్రిడ్జి మరమ్మతులు చేయకపోవడం మనుషుల ప్రణాలు లెక్క చేయకపోవడం పోవడం జరుగుతుంది. దింతో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆదివారం రామారెడ్డి జడ్పీటీసీ మనోవేదనకు గురై నిరసన కార్యక్రమాలతో పాటు దీక్షకు దిగారు. పోలీసులు ప్రత్యక్షం అయి చెదగొట్టె ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పోలీసులకు తెలుసు గంగమ్మ వాగులో ప్రాణాలు కోల్పోతున్నారని ఉద్యోగ రిత్య దీక్షలో కుర్చున్న వారిని బలవంతంగా అరెస్ట్ లు చేసి రామారెడ్డి ఠాణకు తరలించారు. ఏది ఏమైనప్పటికి గంగమ్మ వాగు వంతెనకు మోక్షం ఎప్పుడు లబిస్తుందోననీ మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అరెస్టు అయిన వారిలో పోసానిపేట్ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, ఎస్సీసెల్ ఉపాద్యక్షుడు బాగయ్య , బాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area