ఎంపిడివోలకు వాహన సౌకర్యం

ఖమ్మం, జనవరి 19 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎంపిడివోలకు వాహన సౌకర్యం కల్పిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి, ఫిబ్రవరి మాసాలలో నిర్మహించే పనులను పర్యవేక్షించేందుకు నెలకు 15 రోజుల చొప్పున వాహనాలను వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ఆమె పేర్కొన్నారు.