ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
అదిలాబాద్,మార్చి2(జనంసాక్షి): గ్రావిూణ ప్రాంతంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొంది ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని ప్రజల సమస్యలు తీర్చటానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ఎంపీటీసీ సభ్యుల జిల్లా ఫోరం కో కన్వీనర్ ప్రియాజుద్దీన్ డిమాండ్ చేశారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వుట్నూర్ డివిజన్ ఎంపీటీసీ సభ్యుల ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని అన్నారు. ఎంపీటీసీ సభ్యులకు ప్రతి నెలా రూ.15వేల /-నరవ వేతనంతో పాటు కాకతీయ మిషన్ పనులపై పర్యవేక్షణ అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ జాదవ్ విూరాబాయ్ తదితరులు పాల్గొన్నారు.



