ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారెందుకు? మావోయిస్టుల ముప్పుందా?

7నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు తెలంగాణా ప్రభుత్వ బులెట్ ప్రూఫ్ కారు ని కేటాయించింది. ఎంపీ కవితకు భద్రతా కారణాల రీత్యా బులెట్ ప్రూఫ్ కారు ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా ఓ ఎంపీ కి బులెట్ ప్రూఫ్ కారు కేటాయించడంలో ఇదే ప్రధమం. ఈ అంశాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తమకు గన్ మెన్స్ ని తొలగించి కేసీఆర్ కూతురుకు బులెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేశాడని తప్పు పడుతున్నారు ప్రతిపక్షాలు.అధికారులు భద్రతా కారణాలు అంటున్నారు. ఒకవేళ ఎంపీ కవితకు భద్రతా తగ్గిందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒక వేల భద్రతాకారణాలు అంటే ఆమెకి ఎవరి నుంచి ముప్పు ఉంది. అసలు పోలీస్ అధికారులు భయపడుతున్నది ఎవరి నుంచి.
ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణా లో పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకునే ఇటీవల మావోయిస్టులు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో నిజామాబాద్ మారుమూల ప్రాంతాలకు కూడా తిరిగే ఎంపీ కవితకు ముప్పు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ మేరకు పోలీసులకు ఏవైనా సమాచారం ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎంపీ కవిత బులెట్ ప్రూఫ్ కారు విషయంలో టీఆర్ఎస్ నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు.

మరోపక్క ఎంపీ కవిత హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటూ మహిళా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్దికి కేసీఆర్ పాటుపడుతున్నారని, ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్ దే నని కవిత న్నారు. గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చారని అన్నారు కవిత.