ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

3

– మంత్రి కడియం

హైదరాబాద్‌,మే13(జనంసాక్షి):

తెలంగాణలో గురువారం జరిగే తొలి ఎంసెట్‌కు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామని అన్నారు.  వేరే కేంద్రానికి చేరుకున్నా పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఎంసెట్‌లో నిమిషం నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఎంసెట్‌ పరీక్షకు సకాలంలో చేరుకోవాలని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  కడియం శ్రీహరి తెలిపారు.  విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు పొరపాటుగా వేరే కేంద్రానికి చేరుకున్న పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం. ఎంసెట్‌లో నిమిషం ఆలస్యం నిబంధన కొనసాగుతుంది. విద్యార్థుల తరలింపునకు ప్రైవేట్‌ వాహనాలు సిద్ధం చేశాం. పాఠశాలలు, పోలీసుల వాహనాలను ప్రయాణ సౌకర్యం కోసం వాడుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎంసెట్‌ పరీక్షకు నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయిని ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా ఎంసెట్‌ పరీక్షకు విద్యార్థులను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఎంసెట్‌ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె కారణంగా  ఎంసెట్‌ పరీక్ష నిర్వహాణపై ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ ఇతరు ఉన్నతాధికారులు, జేఎన్టీయూ ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు. అనంతర కన్వీనర్‌ రమణారావు మాట్లాడుతూ… సమ్మె నేపథ్యంలో బస్సుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేలా బయలుదేరాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఓ సెంటర్‌కు  వెళ్లాల్సిన విద్యార్థులు మరో సెంటర్‌కు  వెళ్లినా ఎంసెట్‌ పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తామని రమణారావు వెల్లడించారు. ఇకపోతే ఎంసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌  పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థుల కోసం వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు.  గ్రామాలు, మండలాల్లో వాహనాలు సిద్ధంగా ఉంటాయి. వాహనాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో గురువారం జరగబోయే ఎంసెట్‌ పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అయితే ముందుగానే సెంటర్లకు చేరుకునే ప్రయత్నం చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్‌ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వరంగల్‌ జిల్లా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అన్ని మండల కేంద్రాల నుంచి ఎంసెట్‌ పరీక్షా కేంద్రానికి బస్సులను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. బుధవారం సాయంత్రం నుంచి, గురువారం ఉదయం వరకు ఈ బస్సులు నడుస్తాయని పేర్కొంది.