ఎంసెట్ కౌన్సెలింగ్ మరోమారు వాయిదా
హైదరాబాద్ ,జులై7(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. బుధవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపు వివాదంపై కోర్టును ఆశ్రయించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. న్యాయస్థానం తీర్పు తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం.