ఎంసెట్‌ తేదీలు ఖరారు

1

హైదరాబాద్‌,జనవరి 5(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విూడియాతో మాట్లాడుతూ పలు సెట్‌ల తేదీలను ప్రకటించారు. ఇందు కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎంసెట్‌, ఈసెట్‌ నిర్వహణ బాధ్యతలు జేఎన్‌టీయూ నిర్వహించనుంది. ఎడ్‌ సెట్‌, పీజీ సెట్‌ల నిర్వహణ  బాధ్యతలను ఉస్మానియా  యూనివర్శిటీకి అప్పగించారు. ఐసెట్‌, లా సెట్‌ నిర్వహణ బాధ్యతలు కాకతీయ

యూనివర్శిటీ నిర్వహించనుంది.

తెలంగాణ సెట్ల తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్ర కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుల (సెట్‌) తేదీలు ఖరారయ్యాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌ పాపిరెడ్డి సెట్‌ ల తేదీలను విూడియాకు వెల్లడించారు. మే 2న ఎంసెట్‌, మే 11న పీఈసెట్‌, మే 12న ఈసెట్‌, మే 19న ఐసెట్‌, మే 27న ఎడ్‌ సెట్‌, మే 29న పీజీ ఈసెట్‌, మే 24న లాసెట్‌, అదే రోజు పీజీ లాసెట్‌, మే 11న పీఈసెట్‌ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇందు కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తున్నామని చెప్పారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌, ఈసెట్‌ జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్‌, లాసెట్‌, పీజీ లాసెట్‌ ను నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీఈసెట్‌, ఎడ్‌ సెట్‌, పీజీ ఈసెట్‌ ఎగ్జామ్‌ ను కండక్ట్‌ చేయనున్నారు. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని పాపిరెడ్డి తెలిపారు. ఇప్పట్నుంచే పక్కాగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు.