ఎఐటియుసి రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలి
మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రంలోని కె.ఆర్.భవనంలో ఎఐటియుసి మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అంబటి వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల ధామోధర్ రెడ్డి, మండల కార్యదర్శి అన్నపు వెంకట్ పాల్గొన్నారు. ఎఐటియుసి రాష్ట్ర 3వ మహాసభలు యాదగిరి గుట్టలో నవంబర్ 6,7,8 తేదిలలో జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి తాట తిరుపయ్య,అధ్యక్షులు జంగ నర్సయ్య, ఏడ్ల దండబోయిన మల్లయ్య, తొంటి నరేష్,బుషిపాక నర్సింహ్మ, ఎండి.పాష, కొంపెల్లి నరేష్, తాడూరు లక్ష్మి నర్సయ్య, గొలుసు యాదగిరి, చాపల అంజయ్య,నవీన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.