ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళన

` ఎన్నికల కోడ్‌ ముగిసాక ప్రక్రియ మొదలు
` కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు
` బీఆర్‌ఎస్‌ పనీపాటలేని ఆరోపణలు చేస్తోంది
` మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్పచ్రారమే నని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరవాత ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. దొంగే దొంగ అన్నట్లుగా భారాస నేతల మాటలు ఉన్నాయి. వారు ప్రతిదీ ఆరోపణలు చేసి బద్‌నామ్‌ చేసే దిశగా రారaకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండిరగ్‌లో పెట్టింది. రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు మా ప్రభుత్వంలో జరిగాయి. ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశాం. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టం.. ప్రజలకు కాదు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్‌ శాఖ కేసులు నమోదు చేసింది. టానిక్‌లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశాం. తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావు. ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్‌ ద్వారా బదిలీలు జరుగుతున్నాయి. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఎక్సైజ్‌శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం అని జూపల్లి తెలిపారు.