ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో భూ దందా: సిపిఎం

గుంటూరు,మే4(జ‌నంసాక్షి): అమరావతి-అనంతరంపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకు భూసేకరణ చేయటంపై అభ్యంతరం లేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, వారి ప్రయోజనాల పట్ల చిన్నచూపు ఉందని సిపిఎం నాయకులు అన్నారు.  ప్రభుత్వం ఏమి చేసినా ఎవరూ ప్రశ్నించరనే భావన ఉందని  మండిపడ్డారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేకు రాష్ట్రంలో 26వేల ఎకరాలు, జిల్లాలో 4వేల ఎకరాలకు పైగా భూమి సవిూకరిస్తుందన్నారు. రాజధాని 33వేల ఎకరాలు సవిూకరించిందని, తర్వాత ఎక్స్‌ప్రెస్‌ హైవేకు పెద్దమొత్తంలో భూసవిూకరణకు
సిద్ధమైందన్నారు. ప్రభుత్వం దుర్మార్గమైన చర్యతో పూర్తిగా భూమిపై ఆధారపడి జీవిస్తున్న అత్యధిక మంది చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని  సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు.  ప్రభుత్వం అడ్డగోలుగా, అనవసరంగా వేల ఎకరాలు భూసేకరణ చేయటానికి తీవ్రంగా తప్పు పట్టారు.  రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి భూమిపై తీవ్రమైన దాడి చేస్తుందన్నారు. దీంతో ప్రభుత్వాలు తాము ఏమి చేసినా అడ్డు చెప్పే వారు లేరనే భావనతో ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిజంగా భూమి అవసరం అయితే అందరి ఆమోదంతో, మెరుగైనా ప్యాకేజీ కల్పించి భూసేకరణ చేయాలని, కానీ ప్రభుత్వం అనవసరగా భూసేకరణకు పూనుకుంటుందని, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గపూరిత విధానాలను అడ్డుకోవాలన్నారు.  2013 భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ అంచనా సర్వే జరపాలని, కానీ ఇప్పటి వరకూ నిర్వహించలేదన్నారు. రైతులు భూమి నుండి కదలొద్దని, భూమిని కాపాడుకోవటానికి ఐక్యంగా ఉండాలన్నారు. చంద్రబాబు ఏకపక్షంగా, అనవసంగా భూసేకరణకు పూనుకుంటున్నారని విమర్శించారు.  భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం ప్రజలు అంగీకరిస్తేనే భూమిని తీసుకోవాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం గ్రామంలో భూమిని కోల్పోయే రైతులతో పాటు, దానిపై ఆధారపడిన
వివిధ వర్గాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసి అందరరీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు.