ఎటువంటి లైసెన్సులు లేకుండ గ్రామాలలో అమ్ముతున్న మద్యం
జైనథ్ జనం సాక్షి ఆగస్టు 28
జైనథ్ మండలంలో వివిధ గ్రామాలలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతున్నది జైనథ్ మరియు బోరజ్ రెండు వైన్ షాపులు మాత్రమే లైసెన్స్ తీసుకొని అమ్మబడుతున్నాయి మిగతా గ్రామాలకు మద్యం అమ్మడానికి లైసెన్స్ ఎవరిచ్చారు మేదిగూడ లక్ష్మీపూర్ కరంజి అనంద్ పూర్ పెండల్వాడా సాంగ్వి తదితర గ్రామాలలో మద్యం వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది కొన్ని గ్రామాలలో దేశి దారు కూడా అమ్మబడుతున్నాయి . గ్రామాలలో మద్యం దొరుకుతుంది ఇంకా కొన్ని గ్రామాలలో నైతే ఇండ్లలోని మద్యం అమ్ముతున్నారు ఇలా అమ్మడం మద్యం ఎక్కడబడితే అక్కడ అమ్మడం ఇది ఎంతవరకు సమంజసం కొన్ని గ్రామాలలో ఉన్న వైన్స్లకు చిన్న పిల్లలతో పాటు మహిళలు కూడా మద్యం విక్రయించడానికి వెళ్తున్నారు దీనికి గల కారణం గ్రామాలలో మద్యం దొరకడం యువత చెడు మార్గంలో పోవడానికి కూడా విచ్చలవిడిగా గ్రామాలలో మద్యం దొరకడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు అని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి పెద్దలు చర్చల్లో వస్తున్న మాటలు దీనిని అరికట్టడానికి పోలీసులు ఉన్నారు ఎక్సైజ్ అధికారులు ఉన్నారు అయినా చూసి చూడనట్లు వివరిస్తున్నారని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మేధావులు పెద్దలు యువత రాను రాను ఏమవుతుందో అన్న భయంతో ఉన్నారు.