ఎట్టకేలకు గుట్కా నిషేధం ఇన్ని రోజులకు మంచి నిర్ణయం
హైదరాబాద్, జనవరి 9 (జనంసాక్షి) : గుట్కా బారిన పడి ఎందరో తమ ప్రాణాలమీదు తెచ్చుకుంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు నిషేధించాలని చర్చ జరిగినా ప్రభుత్వం నిషేధించలేకపోయిది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుట్కాపై బుధవారం నిషేదం విధించింది. ఈమేరకు వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. గుట్కా అనుబంధ ఉత్పత్తులపై నిషేధం విధించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 17వది. గుట్కా అనుబంధ ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలు రనామా ప్రదర్శన నిషేధం, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విజిలెన్స్, వాణిజ్యపన్నులు, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, లేబర్, మున్సిపల్, పంచాయత్ రాజ్ విభాగాలు ఈ నిషేధాన్ని సమర్థంగా అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పౌరసంబంధాల శాఖ ఇందుకు విస్తృత ప్రచారం కల్పిస్తుంది. ప్రజలలో అవగాహన కల్పిస్తుంది. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడతారు. వాణిజ్య పన్నుల శాఖ కూడా తనిఖీలు చేస్తుంది.