ఎట్టకేలకు రేవంత్‌కు బెయిల్‌

2

– లాంఛనాలు ఆలస్యం

–  నేడు విడుదలయ్యేఅవకాశం

హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి):

హైకోర్టులో రేవంత్‌రెడ్డి న్యాయవాదులకు బెయిలు ఉత్తర్వులు అందినా లాంఛనాలు పూర్తి కాకపోవడంతో రేవంత్‌ రెడ్డి ఇక బుధవారమే జైలు నుంచి విడుదల కానున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు పూచీకత్తు ఇవ్వాలని ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ ఉత్తర్వులతో రేవంత్‌ న్యాయవాదులు ఎసిబి  అధికారుల వద్దకు వెళ్లారు. అయితే పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్‌ ఆలస్యం కావడంతో జైలుకు వాటిని సమర్పించలేకపోయారు. దీంతో

చర్లపల్లి కారాగారం నుంచి బుధవారం  విడుదల కానున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న రేవంత్‌కి మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఉత్తర్వులు అందినా పూచీకత్తు పక్రియ పూర్తి కాలేదు. శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసేలా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతుండగా మే 31న ఏసీబీ అధికారులు

సికింద్రాబాద్‌ లాలాగూడ విజయపురికాలనీలోని సన్నిహితుడు మార్క్‌ టేలర్‌ నివాసంలో రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయసింహాలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా పట్టుకుని ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. దాని4కి సంబంధించిన వీడియోలు  అధికారులు విూడియాకు విడుదల చేశారు.  జూన్‌ 1న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి నివాసంలో ముగ్గురు నిందితులను హాజరుపరచగా న్యాయమూర్తి వీరికి 14రోజుల పాటు రిమాండ్‌ విధించారు. జైలుకు వెళ్లే ముందు  రేవంత్‌రెడ్డిని నేరుగా అసెంబ్లీకి తీసుకురాగా, అక్కడ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.