ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలి
ఖమ్మం పట్టణం: ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం తెదేపా నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని, రానున్న ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటం ద్వారా రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని సినీనటుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మాగంటి మురళీమోహన్ అన్నారు. ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన 32న పార్టీ ఆవిర్భావ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగాఆ 32 కిలోల కేకును ఆయన కట్ చేశారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు గంగాధర్ చౌదరి, షేక్ మదార్‌సాహెబ్, కుటుంబాక బసవ నారాయణ, స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.