ఎన్టీపీసీలో సౌరవిద్యుత్‌ కేంద్రానికి భూమిపూజ

రామగుండం, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో రాజీవ్‌ రహదారి సమీపంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్‌ కర్మాగారం మొదటి విడతగా 72 ఎకరాల్లో 85 కోట్లతో చేపట్టిన 10 మెగావాట్ల కేంద్రానికి ఎన్టీపీసీ సాంకేతిక సంచారకులు ఎ.కె.జా మంగళవారం భూమిపూజ చేశారు. ఈ నిర్మాణపు పనులను ల్యాంకో సంస్థ చేపట్టనుంది. 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రం నవంబర్‌ 21 నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎం సుభాసిష్‌ గోష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.