ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
` ప్రకటించిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. ఇవాళ దిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసినట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు భాజపా తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు భాజపా సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి రaార?ండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ఎన్డీయే పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ.