ఎన్డీయే ప్రభుత్వంతో ఎవరూ సంతోషంగా లేరు- జనాక్రోశ్‌ ర్యాలీలో రాహుల్‌గాంధీ

ఢిల్లీ(జ‌నం సాక్షి): రాంలీలా మైదానంలో జరుగుతున్న జన ఆక్రోష్ ర్యాలీ బహిరంగసభలో పాల్గొన్న క్రాంగ్రెస్ నేతలు అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. మోడీ ఒకదాని తర్వాత మరొకటి వాగ్ధానం చేస్తున్నారు కానీ  వాటిని అమలు మాత్రం చేయటం లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో జనం సంతోషంగా లేరన్నారు. గంటల కొద్దీ మోడీ అబద్దాలు చెబుతున్నారన్నారు. అవినీతిపరులను పక్కనబెట్టుకొని మోడీ నీతులు చెబుతారన్నారు.  కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ పక్కన అవినీతిపరులున్నారన్నారు. నల్లధనం గురించి పోరాడుతున్నామని మోడీ చెబుతారు.. నీరవ్ మోడీ లాంటి వాళ్లు వేల కోట్లతో పరారవుతున్నారన్నారు. రక్షణ మంత్రికి చెప్పకుండానే రాఫెల్ ఒప్పందం రద్దు చేశారన్నారు రాహుల్ గాంధీ.  అన్నీ రాజ్యాంగ వ్యవస్ధల్లో RSS జోక్యం  చేసుకుంటుదన్నారు రాహుల్ గాంధీ.  అందరూ న్యాయం కోసం కోర్టులకు వెళ్తారు… అయితే మోడీ హయాంలో న్యాయమూర్తులకే న్యాయం దక్కడం లేదన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ… మోడీజీ నేను తినను.. పక్క వారిని తిననివ్వను అని చెబుతారని, అయితే అవినీతి మాత్రం పెరిగిపోయిందన్నారు. మోడీ హయాంలో దేశ ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.