ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ
జగిత్యాల,జనవరి3(జనంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలు జరిగే సమయంతో ఎలాంటి గొడవలు కాకుండా చూడడం, ముందుగానే ఓటర్ జాబితాలను సరి చూచుకోవడం, బ్యాలెట్ బాక్స్‌లు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మూసి వేయాలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.