ఎన్నికల్లో అంతిమ విజయం టిఆర్‌ఎస్‌దే

సుడిగాలి పర్యటనతో ప్రచారం

చంద్రబాబు కూటమిని నమ్మొద్దని పిలుపు

వారు అధికారంలోకి వస్తే చీకట్లేనని హెచ్చరిక

కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పర్యటనలో సిఎం కేసిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో టీఆర్‌ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని సిఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు అందిన నివేదికల మేరకు అన్నిచోట్లా టిఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని అన్నారు. సోమవారం కరీంనగర్‌,వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన ఆశీర్వాద సభలో కెసిఆర్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో 50, 60వేల మంది హాజరై పొజిటీవ్‌ వేవ్‌ కానబడుతోందన్నారు. ఇక్కడ కొనసాగుతున్న అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను వందశాతం టీఆర్‌ఎస్‌ పార్టీ అమలు చేసిందన్నారు. ఎక్కువ స్థానల్లో గెలిచి, బంగారు తెలంగాణ చేసే దిశగా ప్రజలు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు. కరీంనగర్‌ నుంచి గంగుల కమలాకర్‌, మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్‌, చొప్పదండి అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని గెలిపించలని ప్రజలను కోరారు.

ఎన్నికలు వస్తే ప్రజలు ఆగమాగం కావొద్దని, ఆలోచించి ఓటేయాలని కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలని.. పార్టీలు కాదన్నారు. 58 ఏళ్లపాటు పాలించిన పార్టీలు ఏకమయ్యాయని.. మహాకూటమిని ఉద్దేశించి కేసీఆర్‌ విమర్శించారు. చంద్రబాబును కాంగ్రెస్‌ వాళ్లు మోసుకొస్తున్నారని, వలసపాలకులు తెలంగాణకు అవసరమా?అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో బీడీ కార్మికుల జీవితాలు మెరుగయ్యాయని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు అనే పథకం ఇండియాలో కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని పరకాల సభలో అన్నారు. రైతు బీమా.. రైతు బంధును మించిన పథకమన్నారు.

ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆషామాషీగా ఓటు వేయొద్దు. నాయకులు కాదు.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అటు పక్క కాంగ్రెస్‌, టీడీపీ కూటమి.. ఇటు పక్క తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంది. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇంటింటికీ నీళ్లిస్తారని ఎవరూ కల కనలేదు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 ఇస్తారని ఎవరైనా అనుకున్నారా? నీటి తీరువా రద్దు చేశామని సీఎం తెలిపారు. పరకాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని పరకాల నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు. /బిడీలకు ఎనిమిది చేతులు ఉండవని.. వాళ్లు కూడా మనలాగే మనుషులేనని సీఎం సభలో అన్నారు. మనం అణిగిమణిగి ఉన్నంత వరకే రౌడీల రాజ్యం అని.. తొక్కుడు తొక్కితే వాళ్లు జాడ లేకుండా పోవాలని మండిపడ్డారు. తెలంగాణ కోసం తాను రాకాసీతోనే పోటీపడ్డానని.. ఈ గోకాసితో ఏం కాదంటూ సీఎం ఎద్దేవా చేశారు. స్టేషన్‌ ఘనాపూర్‌లో రాజయ్యను గెలిపించాలన్నారు. అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ మళ్లీ అధకిరాంలోకి రావాలన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ దుష్పరాచారాలను తిప్పి కొట్టాలన్నారు. నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్‌. 55 ఏళ్ల పాటు సాగిన కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు. 24 గంటల కరెంట్‌, పెన్షన్లు,

అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో విూకు తెలుసు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి వంటి పథకాలు గతంలో చూశామా? భూమి దున్నుకున్న రైతుల నుంచి గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేస్తే.. మేం రద్దు చేశాం. పైసా ఖర్చు లేకుండా పాసుపుస్తకాలు ఇచ్చి, సాగుకు పెట్టుబడి కూడా ఇచ్చాం. గత మేనిఫెస్టోలో లేకపోయినా.. బీడీ కార్మికులు, బోదకాల బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి విూ కండ్ల ముందే ఉంది. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయ్యాలి. చంద్రబాబు పెద్ద మేధావి అయితే 24 గంటల కరెంట్‌, ఉచిత కరెంట్‌ ఎందుకు ఇవ్వలేదన్నారు. కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.