ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. పక్కాగా ఎన్నికల విధులు
అధికారులకు కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచనలు
ఆదిలాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇసి ఆదేశాల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేసామని కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. డిసెంబర్ 7న పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6గంటలకు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోలింగ్, మాక్ పోల్ అనంతరం వీవీ ప్యాట్‌లోని స్లిప్‌లను తీసివేసి ప్రత్యేక మైన కవర్‌లో వేసి సీల్ వేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులదే ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. పీవో, ఏపీవోలకు రెండో దఫా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాసన సభ ఎన్నికల నిర్వహణను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, నిష్పక్షపాతంగా ఎన్నికల బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించుకోవాలన్నారు. మాక్‌పోల్ నిర్వహించిన రిజల్ట్ నమోదు చేయాలన్నారు. అనంతరం ఉదయం 7గంటల నుంచి ఎన్నికల ఓటింగ్ నిర్వహించాలని అన్నారు. 17ఎ, 17సి, ప్రిసైడింగ్ అధికారి తప్పని సరిగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల పోలింగ్ అనంతరం క్లోజ్ ఓటర్ నొక్కాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను అధికార యంత్రాంగం సజావుగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల అధికారులు విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ రోజు, ఫలితాల రోజు ఎన్నికల అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఇదిలావుంటే 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందితో పాటు కళాశాలలో చదువుతున్న 1550 మంది విద్యార్థులకు ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధుల్లో భాగంగా కళాశాలలోని 1550 మంది విద్యార్థులను ఎంపిక
చేయగా.. వారికి శిక్షణ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో 800 మంది, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు 300 చొప్పున, కామారెడ్డి జిల్లాకు 150 మంది విద్యార్థులు వెళ్లనున్నారు. ఎంపిక చేసిన విద్యార్థులకు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సిన వెబ్ కాస్టింగ్ విధానంతో పాటు పోలింగ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పోలింగ్ పక్రియ మొత్తం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు. యూనివర్సిటీ ల్యాప్‌ట్యాప్‌లతో వెబ్‌కాస్టింగ్ విధానంతో పోలింగ్ కేంద్రంలో విధులను విద్యార్థులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే విద్యార్థులతో పాటు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.