ఎన్నికల సంస్కరణలో కీలక అడుగు
ఆధార్ అనుసంధానానికి సంబంధించి సవరణ బిల్లు
లోక్‌సభలో ప్రవేశ పెట్టిన న్యాయమంత్రి కిరణ్ రిజు
చట్ట సవరణను వ్యతిరేకించిన ఎంఐఎం, కాంగ్రెస్
న్యూఢల్లీి,డిసెంబర్20( జనం సాక్షి ): వచ్చేఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఎన్నికల సంస్కరణలకు సంబంధించికీలక బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. గత వారం కేంద్ర కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించిన కేంద్రం.. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎన్నికల చట్ట 2021 పేరుతో బిల్లును కేంద్రం తెచ్చింది. ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలనుకునేవారి గుర్తింపు పత్రంగా ఆధార్ నెంబర్‌ను అడిగే హక్కు ఎన్నికల నమోదు అధికార్లకు ఉండేలా చట్టంలో మార్పులతో కూడిన బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరించారు. లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ఇవాళ ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం దక్కింది. అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విపక్ష నేతలు అసదుద్దీన్ ఓవైసీ, శశిథరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకిం చారు. ఆధార్‌ను కేవలం అడ్రస్ ప్రూఫ్‌గా వాడారని, కానీ అది పౌరసత్వ ద్రవీకరణ పత్రం కాదు అని శశిథరూర్ అన్నారు. ఓటర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి విూరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండిరగ్ కమిటీకి సిఫారసు చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.